ఈ రోజుల్లో ఓ దినపత్రికను స్థాపించి నడపాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. గతంలో నష్టాలు భరించలేక చాలా దినపత్రికలు మూతపడ్డాయి. ఇప్పుడు ఆ కోవలోనే చేరింది మరో ఇంగ్లీష్ డైలీ. సీఎల్ రాజం ఆధ్వర్యంలో నడిచే ‘మెట్రో ఇండియా’ ఇంగ్లీష్ డైలీ ప్రచురణ డిసెంబర్ 14నుండి అర్థాంతరంగా ఆపేశారు. నష్టాల్లో నడుస్తున్న ఈ పత్రికను ఇక తను నడపలేనని.. అందరికీ రెండు నెలల జీతాన్ని త్వరలోనే అందిస్తానని హామి ఇచ్చి పత్రికను ఆపేస్తున్నట్లుగా ప్రకటించాడు ఎండీ సీఎల్ రాజం. ఇంతకు ముందు ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక కూడా సీఎల్ రాజం ఆధ్వర్యంలోనే నడిచేది. కానీ ప్రస్తుతం ఆ దిన పత్రికకు కేసీఆర్ బంధువు దామోదర్‌రావు ఎండీ గా వ్యవహరిస్తున్నాడు.