తమిళ చిత్రం 'తని ఒరువన్' రీమేక్‌లో రామ్‌చరణ్ నటించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రానికి 'రక్షక్' అనే వర్కింగ్ టైటిల్‌ను అనుకుంటున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కథలో మార్పులు చేయాలని చరణ్ సురేందర్‌రెడ్డికి సూచించాడట. ఒరిజినల్ సినిమాలో హీరో చాలా సీరియస్‌గా, విలన్ కూల్‌గా ఉంటే ఆ క్యారెక్టర్స్‌ను మార్చి ఇక్కడ రివర్స్ చేస్తున్నారు. అంటే చెర్రీ చాలా కూల్‌గా, విలన్ చాలా సీరియస్‌గా ఉంటారని సమాచారం. ముఖ్యంగా చరణ్ తన అభిమానులను దృష్టిలో ఉంచుకొని కొన్ని కామెడీ సన్నివేశాల్లో కనిపించేలా డిజైన్ చేశారంటున్నారు. అలాగే హీరోయిన్‌తో లవ్‌సీన్స్‌ను కూడా బాగా మార్చి, మసాలా అద్దినట్లు చెబుతున్నారు. ఇవన్నీ నిజమైతే...చక్కటి కథని నాశనం చేసినట్టే అంటున్నారు. ఒరిజినల్ చూసినవాళ్లు ఈ మార్పులు చేర్పులపై పెదవి విరుస్తున్నారు. అలాగే ఈ మార్పులు జరిగితే రామ్‌చరణ్ పెద్ద రిస్క్ చేసినట్లే అంటున్నారు.