ఇన్నాళ్ళు సక్సెస్ ఫుల్ నిర్మాతగా, పంపినీదారుగా దిల్ రాజు సినిమా ఇండస్ట్రీలో ఎలా నిలబడ్డాడా అని డౌట్ ఉంటె, అతనికి ఉన్న ప్యాషన్, కమిట్మెంట్ ముఖి కారణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే సినీ పరిశ్రమలో ఉండే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కూడా దిల్ రాజు చక్కగా వాడుకుంటాడు. సరదాగా చెప్పాలంటే, బెంగాల్ టైగర్ విజయంతో అమితమైన ఉత్సాహంతో ఉన్న రవితేజను ఆల్రెడీ ఎవడో ఒక్కడు సినిమా కోసం దిల్ రాజు బ్లాక్ చేసి పక్కన పెట్టాడు. వేణు శ్రీరాం దర్శకత్వంలో ప్రొడక్షన్ కార్యక్రమాల్లో శరవేగంగా దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే బిజినెస్ కూడా మొదలయింది. బెంగాల్ టైగర్ అన్ని రకాలుగా రవితేజ నటించిన అన్ని సినిమాల్లో కల్లా ఎక్కువ కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకుపోతుండడంతో ఎవడో ఒక్కడు వివిధ ఏరియాల పంపిణీ హక్కులకు అప్పుడే రెక్కలొచ్చెసాయట. బెంగాల్ టైగర్ విజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ దాన్ని బీట్ చేసే సినిమాగా ఎవడో ఒక్కడు ఉంటుందని మరీ ఎక్కువ రేట్లతో వ్యాపారం స్టార్ట్ చేసారట. కొనేవాళ్ళు ఉన్నన్నాళ్ళు అమ్మేవాళ్ళకు గిరాకీ ఉంటుంది. కొంచెం తెలివిగా చేసుకుంటే సినిమా పరిశ్రమలో డబ్బులే డబ్బులు. దిల్ రాజుకు తెలియని విషయమా ఇది...!