మెగా ప్రిన్స్ అని మెగాభిమానులు ముద్దుగా పిలుచుకొంటున్న వరుణ్‌తేజ్ తాజాగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో 'లోఫర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈచిత్రం ఈనెల 17న విడుదలకు సిద్దమవుతోంది. కాగా 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' తర్వాత పూరీ దర్శకత్వంలో మదర్ సెంటిమెంట్‌తో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ,మరీ ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో చిత్రీకరించిన ఓ సాంగ్‌ను చూసి మెగాస్టార్ చిరంజీవి బాగా ఎగ్జైట్ అయ్యాడట. ఇందులో వరుణ్‌తేజ్ పర్ఫార్మెన్స్‌ను చూసిన చిరు పూరీ జగన్నాథ్‌తో ఈ పాట గురించి ఏకంగా పది నిమిషాల పాటు మాట్లాడి, ఆ పాట చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు.. కేవలం తన మూడవ చిత్రంతోనే అంతటి పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చిన వరుణ్‌తేజ్‌కు గొప్పనటుడయ్యే లక్షణాలు ఉన్నాయంటూ తెగ మెచ్చేసుకున్నాడట. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి తన 'లోఫర్' ఆడియోకు రాలేదని బాధపడుతున్న వరుణ్‌తేజ్‌కు ఇలా ఇచ్చిన కాంప్లిమెంట్స్ కొండంత బలాన్ని ఇస్తాయని చెప్పవచ్చు.