అక్కినేని అఖిల్ తన రెండో చిత్రాన్ని పూరీజగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నాడని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. కానీ ఈ వార్తలను అఖిల్ కొట్టిపారేశాడు. తన రెండో చిత్రంపై ఆయన వివరణ ఇచ్చాడు. తాను ఏ ప్రాజెక్ట్ కమిట్ కాలేదని, ఏ సినిమాకు సైన్ చేయలేదని ఆయన వివరణ ఇచ్చాడు. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయమై వర్క్ చేస్తున్నానని తెలిపాడు. ఈ సమయంలో సహనం అనేది ఎంతో ముఖ్యమని ఆయన ట్వీట్ చేశాడు. అయితే ప్రస్తుతానికి పూరీతో ఇంకా కమిట్ కాకపోయినా , 'లోఫర్' చిత్రం విజయం సాధిస్తే మాత్రం ఆయన పూరీ డైరెక్షన్‌లో రెండో చిత్రం చేయడం ఖాయమని, ఈ విషయాన్ని అఖిల్ ఖండించలేదని విశ్లేషకులు అంటున్నారు.