హరికథ అన్న పేరుతో ఏదో తేడా కొడుతుందేమో అన్న అనుమానానికి ముందే వచ్చిన హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల సరైన సమయస్ఫూర్తితో తమ సినిమాకు నేను శైలజ అని టైటిల్ ఫిక్స్ చేసేసారు. శివం సినిమాను ఎంత తొందరగా కంప్లీట్ చేసి థియేటర్స్ మీదకి వదిలారో అదే స్పీడుతో ఇప్పుడు జనవరి ఒకటిన నేను శైలజను దింపబోతున్నారు. ఎప్పుడు మాస్ పంథాను మూసలో అనుసరించే రామ్ ఈసారి మాత్రం కొత్తగా ట్రై చేసాడన్న విషయం ఈరోజు విడుదలైన నేను శైలజ టీజర్ చూస్తే వీజీగా తెలిసిపోతుంది. ఓ విభిన్నమైన లవ్ స్టోరీతో నూతన సంవత్సరం రోజున రామ్, కీర్తి సురేష్ మనలను పలకరించబోతున్నారు. వరసపెట్టి తన ప్రేమ ప్రపోజల్స్ అన్నీ ఫెయిల్ అవుతున్న ఓ సింపుల్ అండ్ స్వీట్ లుకింగ్ అబ్బాయికి ఓ అందమైన అమ్మాయి నేను నిన్ను లవ్ చేస్తున్నాను, కానీ లవ్ చేయటం లేదని చెబితే అందులో ఉండే కన్ఫ్యూజన్ ఎంతటి ఫన్ క్రియేట్ చేస్తుందో ఈ రోజు టీజర్లో చూపించారు. ఇప్పటికైతే హరి చెబుతున్న తన శైలజ ప్రేమకథ బాగానే ఉన్నట్టనిపించింది. సంగీత దర్శకుడిగా దేవి ఎలాగు ఉన్నాడు కాబట్టి డోఖా ఉండకపోవచ్చు. మినిమమ్ కంటెంట్ ఉన్నా యూత్ నాడిని బట్టి నేను శైలజ బండి గట్టు ఎక్కేయోచ్చు.