'ఆగడు' చిత్రం ఫ్లాప్ కావడంతో 'బ్రూస్ లీ' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. 'బ్రూస్ లీ' చిత్రం కూడా నిరాశ పరచడంతో శ్రీనువైట్ల పనైపోయిందనుకున్నారంతా.. అయితే తాజాగా తనకొక ప్రాజెక్ట్ ఓకే అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సి.కళ్యాణ్ నిర్మాతగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందనే వార్తలు వినిపించాయి. ఈ విషయాలను కన్ఫర్మ్ చేస్తూ.. సి.కళ్యాణ్, శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమాను నిర్మించబోతున్నాని చెప్పాడు. దీంతో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. మరి ఈ సినిమా అయినా.. వైట్లకు లైఫ్ ఇస్తుందో లేదో చూడాలి..!