సంపత్ నంది దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మాస్ జనాల పల్సు తెలిసిన దర్శకుడిగా సంపత్ ఒక్క సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. దురదృష్టమో లేక కాలం నేర్పిన కొత్త లెస్సనో కాని రెండున్నరేళ్ళ కటినమైన విరామం తరువాత మళ్ళీ మాస్ మహారాజా రవితేజ గారిని బెంగాల్ టైగర్ పేరిట చూపిస్తూ మన ముందుకు సంపత్ రానున్నాడు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే ఒక్కటే ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అంటే జనాలకి కూడా సంపత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్న కోరిక ఇంతకింతకూ పెరుగుతూ పోతోంది.
పవన్ గారితో సినిమా చేయాలంటే కథ ఒక్కటే ఉంటె సరిపోదు. ఆయనకు స్క్రిప్టు మొత్తం నచ్చాలి. అలాగే ఆయన కాల్షీట్స్ లభించాలి. ఇవన్ని జరగాలంటే చాలా సమయం పడుతుంది. అయినా సరే పవన్ గారికి ఓ సరైన కొత్త కథతో వెళ్లి కలుస్తాను. కానీ బెంగాల్ టైగర్ రిలీజయి హిట్టయ్యే వరకు నా ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఇప్పుడేమి మాట్లాడను అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు సంపత్ జవాబిచ్చాడు.