ఆ అనుష్క కోసం కొంతకాలం ఆగాల్సిందే!


అనుష్కను హీరోయిన్‌ అనాలో లేక హీరో అనాలో తెలియని పరిస్థితి. 'బాహుబలి'లో ఓల్ద్‌ గెటప్‌తో, 'రుద్రమదేవి'లో ప్రదానపాత్ర చేసి, 'సైజ్‌ జీరో'లో ఎంతో కష్టపడి నటించడంతో సినిమా ఫలితం ఎలా ఉన్నా అనుష్కకు మాత్రం మంచి పేరే వచ్చింది. అయితే ఆమె మంచి గ్లామర్‌ షోతో ప్రేక్షకులను అలరించి చాలాకాలం అయింది. 'బిల్లా'లో బికినీలో అదరగొట్టిన ఈభామ ఇలా తన అందాలను చాలా సినిమాల్లో ఆరబోసింది. చివరిగా ఆమె ఎంతో కొంత గ్లామర్‌ షో చేసిన చివరి చిత్రం 'మిర్చి'. అనుష్క కొంతకాలం హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు పక్కనపెట్టి గ్లామర్‌ రూట్‌లోకి రావాలని నిర్ణయించుకుందిట. కాగా ప్రస్తుతం ఆమె తమిళ స్టార్‌ సూర్య సరసన హరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సింగం3' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. ఇందులో ఆమె తన అభిమానులను అలరించే పనిలో భాగంగా మంచి గ్లామర్‌షో చేయనుందిట. అలాగే డిసెంబర్‌ నెలలోనే ఆమె నటిస్తున్న 'బాహుబలి' పార్ట్‌ 2 షూటింగ్‌ ప్రారంభం కానుంది. మొదటి భాగంలో తమన్నా చేసినట్లుగా రెండోపార్ట్‌లో అనుష్క.. ప్రభాస్‌ సరసన బాగానే సరస శృంగారాలు చేయనుంది. ఇక ఆమె 'సైజ్‌జీరో' కోసం పెరిగిన 20కేజీల బరువును తగ్గించుకోనే పనిలో ఉంది. ఇప్పటికే 13కేజీలు తగ్గినట్లు సమాచారం. మొత్తానికి అనుష్క కొంతకాలం పాటు కమర్షియల్‌ పంథాలోకి రీఎంట్రీ ఇవ్వనుండటం జేజమ్మకే కాదు.. ఆమె అభిమానులకు కూడా కాస్త మొనాటనీ రాకుండా ఉండేలా చేస్తుందని భావించవచ్చు. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES