బ్రూస్ లీ రిలీజు అప్పుడు అయ్యప్ప దీక్షామాలలో ఉన్న రామ్ చరణ్, ఆనక సినిమా ఎత్తేసిన తరువాత ఎవరికీ కనపడకుండా వెళ్లిపోయారు. కొందరేమో బెంగలూరులోని ఫాం హౌసులో సేద తీరుతున్నాడు అంటే మరో కొందరేమో భార్య ఉపాసనతో ఫారెన్ టూర్ వెళ్ళాడని ఊహించారు. కానీ ఇన్నాళ్ళు చరణ్ స్వామీ మాలపైనే ఉన్నారని, రెండు రోజుల క్రితమే మాలదారుడైన మరో స్నేహితుడు, హీరో శర్వానంద్ సహా ఇంకొంత మంది శబరిమల అయ్యప్ప దర్శనానికి, అటు పై మాలవిరమణకు యాత్ర చేసారని సన్నిహితుల ద్వారా తెలిసింది. మరోసారి అయ్యప్ప దీక్షను దిగ్విజయంగా పూర్తి చేసిన చరణ్ నిన్నే హైదరాబాద్ చేరుకున్నాడట. వచ్చీ రాగానే ఈరోజు వేగాన్ హెల్థి మెనూ లాంచ్ కార్యక్రమం ద్వారా ఇక తన రోజువారీ కార్యక్రమాలను మొదలెట్టాడు. బ్రూస్ లీ తాలూకు చేదు జ్ఞ్యాపకాలను పూర్తిగా మరిచిపోయి రానున్న రోజుల్లో తని ఒరువన్ తెలుగు రీమేక్ పై దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి పనిచేయడానికి మెగా పవర్ స్టార్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడంట.