Advertisement
Google Ads BL

ఆ హీరోకు ఎక్కడో సుడి వుంది!


ఫార్ట్ ఫిల్మ్స్ తీస్తూ.. వైజాగ్ బీచ్‌లో సంచరిస్తూ.. డైరెక్టర్ కావాలనుకునే ఓ కుర్రాడు అనుకోకుండా హీరో అవ్వడం.. వరుసగా ఆ సినిమాలు సూపర్‌హిట్ అవ్వడం నిజంగా ఆశ్చర్యకరమే..! సినీవారసులు రాజ్యమేలుతున్న టాలీవుడ్ పరిశ్రమలో హీరోగా పరిచయం కావడం..సక్సెస్ కావడం.. ఆషామాషీ కాదు. అయితే ఆ కుర్రాడికి అదృష్టం బాగా కలిసొచ్చింది.. అందుకే ఇప్పుడు అందరిలోనూ హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాడు..ఇక అతనెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా..! ఎస్.. అతనే రాజ్‌తరుణ్.. ఉయ్యాలా జంపాలా.. చిత్రంతో హీరోగా పరిచయమై.. తొలిచిత్రంతోనే నటుడిగా మంచి మార్కులు సంపాందించిన రాజ్.. ఆ తర్వాత సినిమా చూపిస్త మామ చిత్ర విజయంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాజాగా సుకుమార్ నిర్మాతగా రూపొందిన ‘కుమారి 21ఎఫ్’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో రాజ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.. అంతేకాదు ఈ యువకథానాయకుడిని టాలీవుడ్ ధనుష్‌గా కూడా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ సినిమాల సక్సెస్ విషయంలో ఎవరి కృషి ఎంత వున్నా.. రాజ్‌తరుణ్ మాత్రం లక్కీ పర్సన్.. అతనికి ఎక్కడో సుడి వుంది. లేకపోతే ఈ వరుస హిట్‌లు రావడమేమిటి అని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే రాజ్ తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆయన శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs