స్టార్ రైటర్ కోన వెంకట్ కు ఈ సంవత్సరం కలిసి రాలేదనే చెప్పాలి. తను పని చేసిన పెద్ద పెద్ద చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. బ్రూస్ లీ చిత్రానికి కోన రాసిచ్చిన 72 సన్నివేశాలను శ్రీనువైట్ల వినియోగించకుండా తన సొంత సీన్లతో సినిమా చేసాడని, సినిమా ఫ్లాప్ విషయంలో తనకు ఎలాంటి బాధ్యత లేదని కోన చెప్పుకొచ్చాడు. అలానే అఖిల్ సినిమా విషయంలో కూడా కేవలం మాటలు మాతమ్రే అందించానని.. స్క్రీన్ ప్లే కు తనకు సంబంధం లేదని చెప్పాడు. అయితే తను స్వయంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ, మాటలు అందించిన 'శంకరాభరణం' చిత్రంతో సత్తా చూపిస్తానని ఛాలెంజ్ చేసాడు. బాలీవుడ్ సినిమాలకు ధీటుగా, కొందరికి సమాధానంగా ఈ చిత్రం ఉంటుందని రిలీజ్ కు ముందు నానాహంగామా చేసాడు. డిశంబర్ 4న రిలీజ్ అయిన 'శంకరాభరణం' రిజల్ట్ మాత్రం మరో విధంగా ఉంది. కోన రాసుకున్న కథలో గానీ, కథనంలో గానీ ఎక్కడా కొత్తదనం లేదు. సినిమా మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు ఆడియన్స్ విసింగించాలనే ప్రయత్నం బాగా చేసాడు. ఇకనైనా కోన వెంకట్ మాటలు మాని చేతల మీద దృష్టి పెడితే మంచి రిజల్ట్ రావచ్చేమో..!