Advertisement
Google Ads BL

ఇక టైగర్ దే హవా..!


ఏ క్షణాన 'బెంగాల్‌టైగర్‌'ను రవితేజ -సంపత్‌నందిల కాంబినేషన్‌లో ముహూర్తం జరుపుకుందో గానీ ఆ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. వినాయక చవితి కానుకగా అని సినిమా షూటింగ్‌లో చెప్పిన దర్శకనిర్మాతలు 'కిక్‌2' ఘోరపరాజయం కావడం, ఆ తర్వాత 'బ్రూస్‌లీ, రుద్రమదేవి, అఖిల్‌, సైజ్‌జీరో' వంటి చిత్రాల విడుదలకు దారినిస్తూ ఎన్నో సార్లు వెనక్కి వెళ్లి పోయింది. మొత్తానికి ఈ చిత్రానికి ఉన్న పోటీ చిత్రాలన్ని విడుదలైన తర్వాత ఈ నెల 10వ తేదీన విడుదలకు సిద్దమైంది. సెన్సార్‌ జరుపుకున్న ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డ్‌ 'యు/ఎ' సర్టిఫికేట్‌ను ఇచ్చింది. సినిమాలో యాక్షన్‌ పాళ్లు ఎక్కువ శాతం ఉండటంతో ఈ చిత్రానికి క్లీన్‌ యు కాకుండా యు/ఎ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు మూడేళ్లు తర్వాత సంపత్‌ నంది డైరెక్ట్‌ చేస్తున్న చిత్రం ఇది. ఆమధ్య పవన్‌తో 'గబ్బర్‌సింగ్‌2' అంటూ వేచివేచి చివరకు రవితేజతో సర్దుకుపోయిన సంపత్‌ పడ్డ కష్టాలు, కసి ఈ చిత్రంతో తీరుతాయమని భావిస్తున్నారు. తమన్నా, రాశిఖన్నాల గ్లామర్‌షోతో పక్కా కమర్షియల్‌ ప్యాకేజీగా వస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో పాజిటివ్‌ బజ్‌ ఉంది. 'కిక్‌2'లాంటి డిజాస్టర్‌ తర్వాత కూడా 30కోట్లకు పైగా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరుపుకోవడం విశేషమనే చెప్పాలి. రాధామోహన్‌ ఎంతో ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం రవితేజ, సంపత్‌నందిలకే కాదు.. నిర్మాత రాధామోహన్‌కు, తమన్నా, రాశిఖన్నాలకు కీలకమైన చిత్రంగా మారింది. ఇక ఈ చిత్రంలో పోసాని పోషించిన 'సెలబ్రిటీ శాస్త్రి' పాత్ర అద్బుతంగా పండిందని సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs