వరస పెట్టి స్వామి రారా, కార్తికేయ అండ్ సూర్య వర్సెస్ సూర్యలతో విజయాలు సాధించినప్పుడు కూడా హీరో నిఖిల్ గారిలో ఇంతటి అత్యుత్సాహం చూడలేదు. కానీ శంకరాభరణం ఒప్పుకున్నప్పటి నుండీ నిఖిల్ బాడీ లాంగ్వేజులో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అంటున్నారు ఆయన్ను క్లోజుగా అబ్జర్వు చేసేవాళ్ళు. మీడియాలో సైతం ఇంతకు మునుపు కనపడినప్పుడు చక్కగా, కుదురుగా అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పేసి సైలెంట్ అయిపోయే నిఖిల్ ఈ మధ్య శంకరాభరణం పబ్లిసిటీ ప్రోగ్రాములలో మాత్రం హీరోయిన్ నందితను ప్రశ్న అడిగినా, పక్కనే ఉన్న కోన వెంకట్ గారిని అడిగినా అందరికీ అడ్డుపడి మరీ తనే జవాబులు ఇచ్చేస్తున్నాడు. ఇతగాడి తంతు చూసి, ఇంతటి అత్యుత్సాహం ఎందుకబ్బా అని నివ్వెరపోతున్నారు జనాలు. కోన వెంకట్ గారితో చేస్తున్నానన్న ధీమాతో ఇలా తయారయ్యాడా లేక శంకరాభరణం మీదున్న కాన్ఫిడెన్సుతోనా అన్నది ఓ వారం రోజులు ఆగితే తేలిపోతుంది. చూసే వాళ్ళ కళ్ళను బట్టి మన కదలికలకు వేర్వేరు అర్థాలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికయితే నిఖిల్ పట్ల అందరికీ సానుకూలమైన అభిప్రాయమే ఉంది. అది అలాగే కొనసాగాలని, శంకరాభరణం వల్ల పెరిగినట్టు కనిపిస్తున్న ఈ అతి ధైర్యం, అతి నిబ్బరం ముందు ముందు కేవలం ధైర్యం, నిబ్బరంగా మారితే చెడుగా చూసేవాళ్లకు కూడా నిఖిల్ మామంచోడుగా కనిపిస్తాడు.