సాధారణంగా అయితే మహేష్ బాబు అంటే పడి చచ్చిపోని ఆడవాళ్ళు ఉండరు. దక్షిణాదిన మాత్రమే కాకుండా ఉత్తరాది భామలు సైతం మహేష్ పేరు చెబితేనే గింగిరాలు తిరిగిపోతుంటారు. అలాంటి మహేష్ బాబుకు మరి ఇష్టమైన హీరోయిన్ ఎవరబ్బా అంటే, బాలివుడ్ భామ దీపిక పదుకొనె అంట. ఈ విషయాన్ని మహేష్ నోటి ద్వారానే వింటే ఇంకా ఎంత మజాగో ఉంటుందో కదా. మునపటి తరంలో నేను అభిమానించిన హీరోయిన్ శ్రీదేవి అయితే ఇప్పటి జనరేషన్లో మాత్రం దీపిక పదుకొనె అంటే చాలా ఇష్టం. పీకు సినిమాలో ఆమె ప్రదర్శించిన నటనకు ఫిదా అయిపోయాను. దీపిక స్వతహాగా అందగత్తే. అలాంటి అందం, అభినయం కలగలిస్తే ఎంత బాగుంటుందో దీపికను చూస్తే తెలుస్తుంది అంటూ మహేష్ చెప్పడంతో దీపిక కూడా ఉబ్బి తబ్బిబ్బయ్యింది. అందుకే ట్విట్టర్ ద్వారా మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలుపుకుంది. దీపిక పదుకొనె నుండి రాబోతున్న కొత్త చిత్రం బాజీరావు మస్తానిలో కూడా ఈమె మస్తాని పాత్రలో ఇరగదీసిందని టాక్. ఇదంతా సరే, మహేష్ అండ్ దీపికలు కలిసి నటిస్తే చూడాలన్నది వీరిద్దరి అభిమానుల కోరిక. ఆ కోరిక నెరవేరే రోజు కోసం అందరం వేచి చూద్దాం.