Advertisement
Google Ads BL

టీచ్‌ ఎయిడ్స్‌ కు 22మంది నటీనటుల సహకారం!


టీచ్‌ ఎయిడ్స్‌ ఇండియా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మల్టీమీడియా ఇంటరాక్టివ్‌ హెచ్‌ఐవి ఎడ్యుకేషన్‌ సి.డి. ఆవిష్కరణ. 

Advertisement
CJ Advs

డిసెంబర్‌ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా టీచ్‌ ఎయిడ్స్‌ ఇండియా ట్రస్ట్‌ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని వయసుల విద్యార్థినీ విద్యార్థులకు హెఐవి ఎయిడ్స్‌పై అవగాహన కలిగించేందుకు యానిమేటెడ్‌ మల్టీమీడియా ఇంటరాక్టివ్‌ హెచ్‌ఐవి ఎడ్యుకేషన్‌ పేరుతో సి.డి.ని విడుదల చేసింది. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన 22 మంది నటీనటులు ఈ యానిమేటెడ్‌ ఫిలింలో తమ క్యారెక్టర్లకు వాయిస్‌ని అందించారు. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, అనుష్క, సుదీప్‌, శృతిహాసన్‌, షబానా ఆజ్మీ, సూర్య, సుహాసిని, సిద్ధార్థ, స్వాతి, ఇమ్రాన్‌ఖాన్‌ తదితర ప్రముఖులు ఈ యానిమేటెడ్‌ ఫిల్మ్‌లో క్రియేట్‌ చేసిన తమ క్యారెక్టర్లకు వాయిస్‌ని అందించారు. నేషన్‌ వైడ్‌గా అన్ని స్కూల్స్‌కి, ఇతర విద్యాలయాలకు ఈ వీడియోను డిసెంబర్‌ నెలలో పంపిణీ చేస్తారు. ఈ మల్టీమీడియా ఇంటరాక్టివ్‌ కంటెంట్‌ను హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌, లేపర్సన్స్‌ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. 

ఈ వీడియోను నవంబర్‌ 30న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రివ్యూ థియేటర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీచ్‌ఎయిడ్స్‌ వ్యవస్థాపకురాలు, సి.ఇ.ఓ. డా|| పియా సర్కార్‌, టీచ్‌ఎయిడ్స్‌ ట్రస్టీ అయిన అక్కినేని అమల, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ ఐఎఎస్‌, అగ్రికల్చర్‌ అండ్‌ కోఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ సి.పార్థసారథి ఐఎస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

టీచ్‌ఎయిడ్స్‌ వ్యవస్థాపకురాలు, సి.ఇ.ఓ. డా|| పియా సర్కార్‌ మాట్లాడుతూ.. ''ఈ మల్టీమీడియా ఇంటరాక్టివ్‌ వీడియోను రూపొందించేందుకు ఎంతో రీసెర్చ్‌ చేశాం. హెచ్‌ఐవి ఎడ్యుకేషన్‌ మెటీరియల్‌ ఎవరికైతే అవసరమో వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోను తయారు చెయ్యడంలో ముఖ్యంగా ఇండియాలోని ప్రముఖ నటనటులు తమ తమ వాయిస్‌ని ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నెలలోనే ఈ మెటీరియల్‌ను ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్‌ చెయ్యడం జరగుతుంది'' అన్నారు. 

టీచ్‌ఎయిడ్స్‌ ట్రస్టీ అక్కినేని అమల మాట్లాడుతూ.. ''యువతీ యువకులంతా హెచ్‌ఐవి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. టీచ్‌ఎయిడ్స్‌ ద్వారా ఎంతో విలువైన ఎడ్యుకేషన్‌ మెటీరియల్‌ను ఉచితంగా ఇండియాలోని విద్యార్థులకు అందించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. దేశంలోని స్కూల్స్‌, హాస్పిటల్స్‌, కౌన్సిలింగ్‌ సెంటర్స్‌లకు లక్ష మాస్టర్‌ కాపీలను పంపిణీ చెయ్యాలన్నది మా లక్ష్యంగా పెట్టుకున్నాం. హెచ్‌ఐవికి సంబంధించిన విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ తెలిజెయ్యాలన్నది మా సంస్థ ప్రధాన ఉద్దేశం'' అన్నారు. 

అగ్రికల్చర్‌ అండ్‌ కోఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ సి.పార్థసారథి మాట్లాడుతూ.. ''ఈ హెచ్‌ఐవి ఎడ్యుకేషన్‌ మెటీరియల్‌ను 7 భాషల్లో 14 వెర్షన్స్‌లో రూపొందించారు. ఈ కంటెంట్‌ ద్వారా హెచ్‌ఐవి నాలెడ్జ్‌ని ప్రతి ఒక్కరిలోనూ పెంచాలన్నది టీచ్‌ఎయిడ్స్‌ సంస్థ లక్ష్యం. దీంతో ఇండియాలోని విద్యార్థులంతా ఈ ఎడ్యుకేషన్‌ మెటీరియల్‌ ద్వారా హెచ్‌ఐవిపై పూర్తి పరిజ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తున్నాను'' అన్నారు. 

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ.. ''ఒక సిస్టమాటిక్‌గా దేశంలోని ప్రతి గ్రామానికి ఈ ఎడ్యుకేషన్‌ను పంపించాలని ప్రయత్నిస్తున్నాం. ఈ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ దేశంలోని అన్ని చోట్ల అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా హెచ్‌ఐవిపై పూర్తి అవగాహన కల్పించేందుకు వీలు కలుగుతుంది. దాని కోసం టీమ్‌ఎయిడ్స్‌ సంస్థ చేసిన ఆరు సంవత్సరా కృషి ఫలితంగా ఇప్పుడు ఈ మల్టీమీడియా ఇంటరాక్టివ్‌ హెచ్‌ఐవి ఎడ్యుకేషన్‌ అనే తయారైంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను'' అన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs