సినీ దిగ్గజ నిర్మాతల్లో ఒకరైన రామానాయుడు గురించి తెలియని వారు ఉండరు. తెలుగు సినీ పరిశ్రమకి వెన్నెముక, తెలుగు సినిమాని ఇతర భాషల సినిమాలకు పోటీ చేయించిన నిర్మాత రామానాయుడు మరణానంతరం..ఆయన ఫ్యామిలీ పరిస్థితి చిన్నాభిన్నం అయిందనే వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో సురేష్‌బాబు ఫ్యామిలీ, వెంకటేష్ ఫ్యామిలీలకు పడటం లేదనే న్యూస్ ఇప్పుడు సంచలనాలకు దారి తీస్తుంది. రామానాయుడు ఉన్నంత వరకు వ్యాపార వ్యవహారాలన్నీ చూసిన సురేష్‌బాబు..ఇప్పుడు అంతా తనదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, ఇది నచ్చని వెంకటేష్..పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా.., లోలోపల చాలా మదనపడుతున్నాడని టాక్. పెద్ద ఫ్యామిలీ కావడంతో..వ్యవహారం బయటికి రాకుండా చూసుకుంటున్నా...వెంకటేష్‌కి అన్యాయం జరుగుతుందనే వార్త వెంకీ ఫ్యాన్స్‌ని కలచివేస్తుంది. త్వరలోనే వారి మధ్య విభేదాలు తొలగిపోవాలని వారు కోరుకుంటున్నారు.