Advertisement
Google Ads BL

అయ్యో! అనుష్క మళ్ళీ చేయాలా?


ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని కథానాయికల్లో అనుష్క మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డబ్బు, సక్సెస్ చుట్టూ తిరిగే సినీ పరిశ్రమలో అనుష్క లాంటి మానవత్వం వున్న అమ్మాయిలు అరుదుగా కనిపిస్తారు. అందర్నీ ఆత్మీయంగా పలకరించడం.. చుట్టూ వున్న వారికి సహాయం చేయడం అనుష్కలోని మంచితనానికి నిదర్శనం. అంతేకాదు నిర్మాతల విషయంలో కూడా ఈ స్వీటి కాస్త పెద్ద మనసుతోనే ఆలోచిస్తుంది. ఒక్కోసారి తన మంచితనం, మెహమాటంతోనే ఈ అందాలభామ నష్టపోవాల్సి వస్తుంది కూడా. తాజాగా ‘సైజ్‌జీరో’ విషయంలో అనుష్కకు అలాంటి అనుభవమే ఎదురైంది.  పీవీపీ సినిమా పతాకంపై అనుష్క ప్రధాన పాత్రలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించారు నిర్మాత పొట్లూరి ప్రసాద్. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయంగా నిలిచింది. అయితే ఆ చిత్రం ఫెయిల్యూర్ విషయంలో నిర్మాత భారీగా నష్టపోవడాన్ని చూసిన అనుష్క పీవీపీ సంస్థలో ఓ సినిమాను పారితోషికం లేకుండా చేస్తానని మాటిచ్చింది. ఆ మాటకు వెండితెర రూపమే ‘సైజ్‌జీరో’. బాహుబలి, రుద్రమదేవి లాంటి పవర్‌ఫుల్ చిత్రాలను చేస్తున్న అనుష్క.. మెహమాటంతోనే సైజ్‌జీరో చిత్రాన్ని అంగీకరించింది. అంతేకాదు పీవీపీ సంస్థలో నాగార్జున, కార్తీ హీరోలుగా రూపొందుతున్న ‘ఊపిరి’ చిత్రంలో కూడా అనుష్క ఎటువంటి రెమ్యూనరేషన్ లేకుండానే అతిథి పాత్రలో నటిస్తోంది. అయితే ఇటీవల విడుదలైన ‘సైజ్‌జీరో’కు వీక్‌టాక్ రావడంతో మళ్ళీ అనుష్కకు బెంగపట్టుకుంది. ఈ సినిమా కోసం పీవీపీ సంస్థలో మరో సినిమా చేయాలా? అని ఆలోచిస్తుందట.. అయితే ఆమె శ్రేయాభిలాషులు, సన్నిహితులు మాత్రం అమ్మా స్వీటీ... అంత మంచితనం పనికిరాదు అంటూ హితవు చెబుతున్నారట.! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs