వీవీ వినాయక్ సినిమాలకు వేలెత్తి చూపడానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే పూర్తి స్థాయి కమర్శియం సినిమాలు తీయడంలో ఈయనది అందె వేసిన చెయ్యి. ఇప్పటి వరకు వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చాలా చిత్రాలు ఘన విజయాలను సాధించాయి. కాబట్టి మార్కెట్ ప్రకారంగా వినాయక్ సినిమా అంటే పంపిణీదారులు లగెత్తుకొచ్చి రికార్డు రేట్లకు అన్ని ఏరియాలను కొనుగోలు చేస్తారు. ఇదే నమ్మకంతో అక్కినేని అఖిల్ చిత్రాన్ని కూడా కొలతకు మించి కొన్నారు. సినిమా పరిస్థితి డిజాస్టర్ అని మొదటి రోజే తేలడంతో తమ తమ నష్టాలను తగ్గించుకోవడానికి కొందరు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతను, దర్శకుడిని రెండో రోజు నుండే నష్టపరిహారం చెల్లించమని ప్రాధేయపడుతున్నారు. నిర్మాత ఏమో గానీ వినాయక్ మాత్రం తన ఓటమిని అంగీకరిస్తూ తనకు రావలసిన బ్యాలెన్స్ పారితోషికాన్ని వదలుకున్నాడని తెలుస్తోంది. ఈ డబ్బు మొత్తాన్ని వైజాగ్ మరియు ఇతర ఏరియాల పంపిణీదారులకు పంచవలసిందిగా నిర్మాతను కోరారట. విశేషం ఏమిటంటే చెప్పుకోవడానికి ఇదంతా బాగానే ఉన్నా వినాయక్ మొత్తం రెమ్యూనరేషన్ పది కోట్లకు గాను ఏడు కోట్లు ఆల్రెడీ పుచ్చుకున్నారనీ, మిగిలింది కేవలం మూడు కొట్లేనని వినికిడి. ఈ మూడు కోట్లను పంచితే, పెట్టిన దానితో పోలిస్తే తలా వచ్చేది పిప్పరమెంటు బిళ్ళతో సమానమేనట. అట్టర్ ఫ్లాప్ సినిమా మీద కూడా వినాయక్ ఏడు కోట్లు లోపలేసాడు.