భర్త ఆమీర్ ఖాన్ గారిని భారత దేశం విడిచి వెళ్ళిపోదామా అని అడిగిన అతని భార్య కిరణ్ రావు మీద యావత్ దేశం దుమ్మెత్తి పోసినంత పని చేసింది. అందరి దృష్టీ ఆమీర్ నుండి ఈ వివాదంతో కిరణ్ మీదకి మళ్ళింది. తీరా చూస్తే ఈ కిరణ్ రావు మన తెలుగు అమ్మాయే అంటే ఆశ్చర్యపోకండి. కిరణ్ తాతగారు తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వనపర్తి రాజవంశీయులు. కిరణ్ తండ్రి వృత్తిరిత్యా ముంబై, కలకత్తా మరియు బెంగళూరులో పని చేయడంతో కిరణ్ కూడా దేశంలోని ప్రముఖ పట్టణాల్లో పని చేసింది. ముంబైలో అసిస్టెంట్ దర్శకురాలిగా లగాన్ చిత్రానికి పని చేస్తున్నప్పుడు ఆమీర్ ఖాన్ గారితో స్నేహ బంధం ఏర్పడి అది కాస్తా ప్రేమ బంధంగా మారి అటు తరువాత వివాహ బంధంగా వీరిద్దరినీ ముడి వేసింది. ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న తరువాతే కిరణ్ రావును వివాహమాడారు. ప్రస్తుతం కిరణ్ రావు, ఆమీర్ తమ పుత్రుడు బుల్లి ఆజాదుతో ముంబైలో జీవిస్తుంటే కిరణ్ తల్లితండ్రులు బెంగుళూరులో ఉంటున్నారు. సో, కిరణ్ రావు మన తెలుగు అమ్మాయే.