సుకుమార్ సమర్పణలో లోబడ్జెట్ మూవీగా వచ్చిన 'కుమారి 21ఎఫ్' బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను కొల్లగొడుతోంది. దీంతో నిర్మాతలతో పాటు బయ్యర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా నైజాం రైట్స్ కొనుగోలు చేసిన దిల్‌రాజుకు భారీ లాభాలు వస్తున్నాయి. దిల్‌రాజు నిర్మాతగా పలు పెద్ద సినిమాలు సెట్స్ మీద ఉండేవి. అయితే ఈ మధ్య సినిమా నిర్మాణం విషయంలో చాలా స్లో అయ్యాడు. కారణం ఆయన గత కొన్ని చిత్రాలు భారీ నష్టాలు మిగల్చడమే. దీంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలో మళ్లీ బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో 'కుమారి 21ఎఫ్' చిత్రాన్ని 25లక్షల రీఫండబుల్ అడ్వాన్స్‌తో 2.5కోట్లకు కొనుగోలు చేశాడు. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే దిల్‌రాజుకు పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోటి రూపాయల లాభం వచ్చింది. సినిమా బిజినెస్ పూర్తయ్యేలోపు మొత్తం పెట్టుబడికి కనీసం మూడు నాలుగు రెట్లు లాభం వస్తుందని ట్రేడ్‌వర్గాలు తేల్చేస్తున్నాయి.