Advertisement
Google Ads BL

బాలీవుడ్‌ 'శ్రీమంతుడు' కూడా కొరటాలేనా..!


డైరెక్టర్‌గా తన మొదటి చిత్రం 'మిర్చి'తోనే రికార్డులు సృష్టించి, ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటి మహేష్‌బాబు 'శ్రీమంతుడు'తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాదించిన దర్శకుడు కొరటాల శివ. కాగా ఈ చిత్రాన్ని చేయడానికి పలువురు బాలీవుడ్‌ హీరోలు, దర్శకనిర్మాతలు ఎంతో ఆసక్తిచూపారు. అయితే ఈ చిత్రాన్ని హృతిక్‌రోషన్‌ హీరోగా బాలీవుడ్‌కి వెళ్లనుంది. హిందీలో కూడా ఈ చిత్రాన్ని కొరటాల శివనే దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. తెలుగులో ఎన్టీఆర్‌తో చేయబోయే చిత్రం పూర్తయిన తర్వాత కొరటాల శివ తన దృష్టిని ఈ రీమేక్‌పై పెట్టనున్నాడు. ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ కూడా కొరటాల దగ్గరే ఉన్నాయి. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థతో కలిసి కొరటాల శివ కూడా సంయుక్తంగా నిర్మించనున్నాడు. కాగా 'శ్రీమంతుడు' చిత్రంలో మహేష్‌బాబుకు తండ్రి పాత్ర పోషించిన జగపతిబాబు స్థానంలో ఆ పాత్రను స్వయాన హృతిక్‌రోషన్‌ తండ్రి రాకేష్‌రోషన్‌ పోషించనున్నాడట. మరి ఈ చిత్రంతో కొరటాల శివ బాలీవుడ్‌లో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సాధిస్తాడో వేచిచూడాల్సివుంది.  

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs