Advertisement

వెంకటేష్‌ వాకిట్లోకి రెండు సినిమాలు!


ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు.. అనే సామెతను నిజం చేస్తూ 'గోపాల గోపాల' తర్వాత విక్టరీ వెంకటేష్‌ కూడా పవన్‌కళ్యాణ్‌లా మౌనవ్రతం చేపట్టాడు. ఆయన మేకప్‌ వేసుకొని 8నెలలయ్యింది. అయినా తన తదుపరి చిత్రంపై వెంకీ నోరు మెదపడం లేదు. ఈ ఫ్యామిలీ హీరో ఎవరి డైరెక్షన్‌లో సినిమా చేస్తాడు? అనే దానిపై క్లారిటీ లేదు. కాగా ఇప్పుడు ఈ చిక్కుముడి వీడిందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఆమధ్య వెంకటేష్‌ -నయనతార కాంబినేషన్‌లో 'రాధ' అనే చిత్రం ప్రారంభించి, స్టోరీ వివాదం తలెత్తడంతో ఆ ప్రాజెక్ట్‌ను వెంకీ పక్కనపెట్టాడు. అయితే మరలా మారుతి 'భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో తాను క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ కూడా తీయగలనని నిరూపించుకొని కొత్తగా వెంకీ కోసం మరో పక్కా ఫ్యామిలీ సబ్జెక్ట్‌ తయారు చేసి, వెంకీకి వినిపించి గ్రీన్‌సిగ్నల్‌ పొందాడు. ఈ చిత్రానికి 'బంగారు బాబు' అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. ఇందులో కూడా నయనతారనే హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 16న పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనిలో పనిగా ఆయన 'ఓనమాలు' డైరెక్టర్‌ క్రాంతిమాధవ్‌ చెప్పిన 'సంతోషం సగం బలం'ని కూడా లైన్‌లోనే ఉంచినట్లు సమాచారం. మొత్తానికి వెంకీ మరలా మేకప్‌ వేయడం ఆయన అభిమానులకు ఆనందం కలిగించే విషయమే.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement