బడా కుటుంబాల వంశ పరువు, ప్రతిష్టలను భుజాన వేసుకోవడానికి వస్తున్న కొత్త రక్తం యువతరం నటుల పట్ల మీడియా ఎప్పుడూ ఆశావహంగానే వ్యవహరించింది. రామ్ చరణ్, ప్రభాస్ నుండి ఇప్పుడొచ్చిన అక్కినేని అఖిల్ పట్ల కూడా ఎనలేని ఆశలు కల్పించి ప్రజలకు వీళ్ళని బాగా దగ్గర చేసింది. అఖిల్ సినిమా ఫలితం ఎలా ఉన్నా అక్కినేని అఖిల్ మాత్రం మన అందరివాడు అయిపోయాడు. ఇక రెండో చిత్రం పట్ల కాసింత జాగ్రత్త వహిస్తే అఖిల్ బాబుని కూడా స్టార్ హీరోల జాబితాలోకి ఎంచక్కా చేర్చేస్తారు మన అభిమానులు, మీడియా మిత్రులు. అఖిల్ తంతు ఎలాగో క్లోజ్ అయిపొయింది కనుక అందరి కన్ను ప్రస్తుతానికి నందమూరి నటవంశాంకురం మోక్షజ్ఞ్య మీద పడింది. బాలకృష్ణ ఎప్పుడెప్పుడు ఓ ప్రకటన చేస్తాడా అని కళ్ళు కాయలు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. ప్రస్తుతానికి బాలయ్య దీక్షగా తన 99వ డిక్టేటర్, 100వ సినిమా కథా ఎంపికలో, తెదేపా రాజకీయాలతో గజిబిజిగా ఉండడంతో మరికొన్ని రోజులు మోక్షజ్ఞ్య మీద ఎడాపెడా రూమర్స్ పుట్టించుకునే భాగ్యం దక్కింది.