మిగిలిన బాలీవుడ్ స్టార్స్ అందరూ 100కోట్లు సాధించడానికి ఆపసోపాలు పడుతుంటే తన సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ మాత్రం మంచి నీళ్లు తాగినంత సునాయాసంగా 100కోట్లను అందుకొంటూ దూసుకుపోతున్నాడు. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ ఎవరు? అంటే అందరూ ఠక్కున సల్మాన్ పేరే చెబుతున్నారు. ఆయన 'దబాంగ్' చిత్రంతో మొదటిసారి 100కోట్ల క్లబ్‌లో చేరాడు. అదే వరసలో ఏకంగా తాను నటించిన తొమ్మిది సినిమాలను వరుసగా 100కోట్ల క్లబ్‌లో చేర్పించాడు. బాలీవుడ్‌లో వరసగా 9సెంచరీలు సాదించాడు ఆయన. ఇటీవల విడుదలైన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' చిత్రం కూడా కేవలం 4రోజుల్లో 180కోట్లు వసూలు చేసింది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా అది కలెక్షన్లపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఆయన 'దబాంగ్, రెడీ, బాడీగార్డ్, దబాంగ్2, ఏక్‌థాటైగర్, కిక్, జయహో, భజరంగీ భాయిజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఇలా వరుసగా 9 చిత్రాలతో 100కోట్లు దాటాడు. ఇది ఓ పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. కాగా ఈ 'ప్రేమ్‌రతన్‌ధన్‌పాయో' చిత్రాన్ని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి 'ప్రేమలీల'గా విడుదల చేశారు. కాగా సల్మాన్ రిక్వెస్ట్‌తో ఈ చిత్రంలో సల్మాన్ పాత్రకు రామ్‌చరణ్ డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు వరస ఫ్లాప్‌లో ఉన్న రామ్‌చరణ్, డబ్బింగ్ చెప్పిన సినిమా కూడా ఇక్కడ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం.