యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ వస్తోంది అనసూయ. ఆకట్టుకునే అందం, చలాకీతనం, మాటల్లో గడుసుతనంతో ఆమె యాంకరింగ్ రంగంలో దూసుకెళ్లడంతో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. అందగత్తె కావడంతో సోషల్ మీడియాలో కూడా ఆమెకు అభిమానులు ఎక్కువే. ఇక తరచు ఫొటో షూట్లతో హాట్ అండ్ సెక్సీ లుక్స్‌తో అనసూయ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో పలు సంస్థలు ఆమెతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించడానికి ఆసక్తి చూపుతున్నాయి. కాగా ఆమె ప్రస్తుతం నాగార్జున హీరోగా చేస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు గాను అమ్మడు రోజుల లెక్కన రెమ్యూనరేషన్ తీసుకుంటోందిట...! రోజుకు 4లక్షల చొప్పున మొత్తం 10రోజుల షూటింగ్‌లో పాల్గొన్నందుకు గాను 40లక్షలు చార్జ్ చేసినట్లు సమాచారం. తెలుగులో ఆదాశర్మ, రెజీనా, ప్రణీత వంటి హీరోయిన్లు కూడా రోజుకు 4లక్షలు డిమాండ్ చేయడం లేదు. వారు నెలల తరబడి షూటింగ్‌లో కష్టపడతారు. పైగా డ్యాన్స్‌లు, హాట్ అండ్ రొమాంటిక్ సీన్లు, ముద్దు సీన్లు .. ఇలా చాలా చేయాలి. కానీ అవేమీ లేకుండానే అనసూయ ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది.