మెగా బ్రదర్ నాగబాబు గారి కూతురు నిహారిక తెరంగేట్రం అయిపోయినట్టే. ఇక అఫీశియలుగా పెద్ద స్క్రీన్ మీద కనపడటం ఒక్కటే తరువాయి ఎందుకంటే ఈవిడ కథానాయికగా ఫిక్స్ అయిన ఒక్క మనసు సినిమా తాలూకు ముహూర్తం, పూజ, మొదటి క్లాప్ నిన్నే ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండా పూర్తయ్యాయి. విశేషం ఏమిటంటే మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ తమ ఆశీర్వాదం ఇవ్వడానికి స్పాటుకి రాలేదంట. నాగ శౌర్య హీరోగా, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు రామరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ స్వచ్చమైన ప్రేమకథకు నిహారికను సెలెక్ట్ చేయడానికి, అలాగే మెగా ఫ్యామిలీని ఒప్పించడం మొత్తం టీంకి తలకి మించిన భారం అయిందట. కానీ రామరాజుకి ఉన్న రెప్యుటేషన్ దృష్ట్యా రానున్న రోజుల్లో మెగా కుటుంబం మొత్తం తరలి వచ్చి నిహారికకు తోడుగా ఉంటారు. సినిమాను ప్రమోట్ చేయడం దగ్గరి నుండి, ప్రొడక్షను కార్యక్రమాల్లో కూడా కావలసిన హెల్ప్ తప్పకుండా దొరుకుతుంది. నాన్న, బాబాయ్, పెద నాన్న, అన్నయలు, మామయ్యలు, బావలు... ఇలా అందరి బ్లెస్సింగులతో నిహారిక నిజంగానే పెద్ద హీరోయిన్ అయిపోతే బాగుంటుంది కదా!