నితిన్ ఈ మధ్యే పుంజుకున్న హీరో. అతని తండ్రి సుధాకర్ రెడ్డి మొదటి నుండి సినిమా నిర్మాణం, పంపిణీ రంగాలలో ఉండడంతో నితిన్ భవిష్యత్తు ఆగమ్యగోచరంలో పడికొట్టుకుపోతున్నా తెడ్డేసి ఇష్క్ చిత్రంతో బతికించి మళ్ళీ ఓ గాడిన పడేలా చేసాడు. అదే ఊపులో అక్కినేని కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం మీద అఖిల్ ఆరంగేట్రానికి ఉన్నదానికి మించి అసలు మార్కెట్టే తెలియని పిల్లాడి మీద సుమారుగా యాభై కోట్లు కుమ్మరించారంటే అది మూర్ఖత్వం అనాలో లేక అమాయకత్వం అనాలో తెలియదంటున్నారు విశ్లేషకులు. అఖిల్ ఎంత వసూల్ చేసింది, ఎంత నష్టపోతుంది అన్న లెక్కకు ముందు నితిన్ మాత్రం వీలైనంతగా లాస్ నుండి బయటపడే మార్గం ఒకటి ఉండేది, కానీ అదీ ఇప్పుడు ముసుకు పోయింది. పొదుపు మరిచి దుబారా ఖర్చు చేయడంతో నిర్మాతగా విఫలమైన నితిన్, సుధాకర్ రెడ్డిలు ఏ విధంగానైతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ఏరియాల పంపిణీ హక్కులను ఎక్కువ రేట్లకు అమ్ముకొని క్యాష్ చేసుకున్నారో అదే రకంగా నైజామ్ హక్కులు కూడా అమ్ముకొని ఉంటె కొద్దో గొప్పో నష్టం తగ్గేది. కానీ గ్లోబల్ డిస్ట్రిబ్యుషన్ సంస్థ ద్వారా నైజామ్ అంతటా చాలా ఎక్కువ థియేటర్లలో అఖిల్ చిత్రాన్ని సొంతంగా విడుదల చేసి నష్టాన్ని మరింతగా పెంచుకున్నారు. దీనితో అటు నిర్మాతగా, ఇటు పంపినీదారుగా రెండింటిలోను ఎదురు దెబ్బే తగిలింది.