పూరి జగన్నాథ్ ఇప్పటివరకు చేసిన సినిమాలను చూస్తే అతని సెటప్పే డిఫరెంట్ అని అర్థమవుతుంది. అతని కథల్లోని హీరో రఫ్ అండ్ టఫ్‌గా వుంటాడు. ఎవరికీ భయపడడు, ఎవర్నీ లెక్క చేయడు. అతనికి కొంత తిక్క వుంటుంది. కానీ, దానికీ ఓ లెక్కుంటుంది. అతని డైలాగ్ మాడ్యులేషన్ వేరు, అతని బాడీ లాంగ్వేజ్ వేరు. పూరి జగన్నాథ్ క్రియేట్ చేసే ఒక్క క్యారెక్టర్‌లో ఇన్ని వేరియేషన్స్ వుంటాయి. పూరికి సెట్ అయిన హీరో, పూరితో ఎక్కువ సినిమాలు చేసిన హీరో రవితేజ ఒక్కడే. రవితేజ తర్వాత చాలా మంది పూరి డైరెక్షన్‌లో సినిమాలు చేసినా వారిని రవితేజతో పోల్చలేం.
అలా పూరి, రవితేజ బాగా సెట్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే వీరిద్దరి కాంబినేషన్‌లో మంచి హిట్ సినిమాలు వచ్చాయి. ఇదంతా బాగానే వుంది గానీ లేటెస్ట్‌గా వరుణ్‌తేజ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న లోఫర్ చిత్రం గురించి, వీరిద్దరి కాంబినేషన్‌లో టాలీవుడ్‌లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందన్న న్యూస్ వచ్చినప్పుడే ఇది వర్కవుట్ అవుతుందా అనే డౌట్ అందరికీ వచ్చింది. ముకుంద, కంచె వంటి సాఫ్ట్ సినిమాల తర్వాత వరుణ్ ఒక మాస్ ఎంటర్‌టైనర్ చేస్తే ఆడియన్స్ చూస్తారా? ఒక్కసారిగా అతని బాడీ లాంగ్వేజ్‌లోని మార్పుని గానీ, డైలాగ్ డెలివరీలోని స్పీడ్‌ని గానీ ఆడియన్స్ రిసీవ్ చేసుకోగలరా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్ 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి నిర్మాత సి.కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు. రెగ్యులర్‌గా పూరి సినిమాలా లోఫర్ లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీజనం. ఒక్కమాటలో చెప్పాలంటే పూరికి, వరుణ్‌కి అస్సలు సెట్ అవ్వలేదంటున్నారు.