Advertisement
Google Ads BL

అఖిల్‌ సెకండ్‌ మూవీ కన్‌ఫర్మ్‌ అయిందట.!


అఖిల్‌ సినిమా రిలీజ్‌ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూడడం, అది రిలీజ్‌ అవ్వడం జరిగిపోయాయి. ఈ సినిమా రిజల్ట్‌ ఎలా వుందన్నది పక్కన పెడితే అఖిల్‌ నెక్స్‌ట్‌ ఏం సినిమా చెయ్యబోతున్నాడన్న దానిపైనే టాలీవుడ్‌లో డిస్కషన్‌ మొదలైంది. డాన్సుల్లో, ఫైట్స్‌లో ది బెస్ట్‌ అనిపించుకున్న అఖిల్‌ తన నెక్స్‌ట్‌ మూవీ ఏ డైరెక్టర్‌తో చెయ్యబోతున్నాడు, ఆ సినిమాని ఎవరు ప్రొడ్యూస్‌ చేస్తున్నారు అనేది కన్‌ఫర్మ్‌ అయిందని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

అక్కినేని నాగార్జునతో చాలా సినిమాలు నిర్మించిన కామాక్షి మూవీస్‌ అధినేత డి.శివప్రసాద్‌రెడ్డితో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్‌, కంచె వంటి డిఫరెంట్‌ చిత్రాలతో దర్శకుడు మంచి పేరు తెచ్చుకున్న క్రిష్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయబోతున్నాడట. 2016లో ఈ చిత్రం ప్రారంభించే అవకాశం వుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs