బ్రూస్ లీ కన్నా ముందే రాజశ్రీ ప్రొడక్షన్ సంస్థ వారికి, సల్మాన్ ఖాన్ గారికి ఇచ్చిన వాగ్దానం మేరకు రామ్ చరణ్ తన గొంతుతో ప్రేమ్ పాత్రకు ప్రేమలీల చిత్రంలో ప్రాణం పోసాడు. ప్రేమ్ రతన్ ధన్ పాయో హిందీ సినిమాకు తెలుగు డబ్బింగ్ చెప్పిన రామ్ చరణ్, అలా తెలుగు వెర్షను పబ్లిసిటీకి కూడా హెల్ప్ అయ్యాడు. సల్మాన్, రామ్ చరణ్ అన్న పేర్ల మీద కొద్దో గొప్పో ఓపెనింగ్స్ రాబట్టుకున్న ప్రేమ లీల, ఓవరాలుగా చరణ్ ఖాతాలో మరో ఫ్లాపు కింద లెక్క కట్టాల్సిందే. ఓ వైపు హిందీ వెర్షన్ మాత్రం మూడు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని చేరుకొని దీపావళి పండక్కి అసలు సిసలైన సూపర్ హిట్టుగా నిలిస్తే తెలుగు ప్రేమలీల మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి మెగా లీల చూపకుండా వెనుదిరగడానికి సిద్ధంగా ఉంది. బ్రూస్ లీతో పోల్చుకుంటే ఇది రామ్ చరణ్ చిత్రం అన్నది చాలా కొద్దిమందికే తెలియడంతో మెగా ఇమేజికి వచ్చిన నష్టం తక్కువే. ఫ్లాప్ అయినా హిట్టు అయినా, ఇది చరణ్ సినిమా కిందే ఉండాలన్నది ఇంకొందరి వాదన.