Advertisement
Google Ads BL

మూడు రోజులకు 100 కోట్లు దాటిందట.!


రాజశ్రీ ప్రొడక్షన్స్‌ సినిమాల గురించి తెలియని వారు వుండరు. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ సినిమాలు తియ్యాలన్నది వారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే 1947లో ప్రారంభమైన ఈ సంస్థ ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించింది. తాజాగా ఈ బేనర్‌లో వచ్చిన మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ప్రేమ్‌రతన్‌ ధన్‌ పాయో. సల్మాన్‌ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా సూరజ్‌ ఆర్‌.బర్జాత్యా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ దీపావళికి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని డబ్‌ చేసి రిలీజ్‌ చేశారు. 

Advertisement
CJ Advs

హిందీ వెర్షన్‌కి సంబంధించి మూడు రోజులకు ఇండియాలో ఈ చిత్రం కలెక్షన్‌ 100 కోట్లు దాటింది. సినిమాకి డివైడ్‌ టాక్‌ వున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగానే వున్నాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌లో మొదటి మూడు రోజుల కలెక్షన్‌ 100 కోట్లు దాటడం ఇది తొమ్మిదోసారి. ఈ సంవత్సరం భజరంగీ భాయ్‌జాన్‌ తర్వాత సల్మాన్‌కి ఇది రెండో సినిమా. ఈ చిత్రం నాలుగో రోజుకి 135 కోట్లు దాటే అవకాశం వుందని ట్రేడ్‌వర్గాలు చెప్తున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs