Advertisement
Google Ads BL

కృష్ణవంశీ.. దెయ్యం తమన్నా కాదు!


'గోవిందుడు అందరివాడేలే' చిత్రంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన దర్శకుడు కృష్ణవంశీ. ఆయన ప్రస్తుతం హర్రర్‌ జోనర్‌లో ఓ స్క్రిప్ట్‌ రెడీ చేసుకుంటున్నాడు. కాగా ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి నటుడు ప్రకాష్‌రాజ్‌ స్వయంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది ఓ లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌గా రూపొందనుంది.  ఈ చిత్రం విషయంలో నిన్నటివరకు తమన్నా పేరు వినిపించింది. కానీ ఇప్పుడీ అవకాశం స్వీటీ అనుష్క దగ్గరకు వెళ్లింది. ఈ కథకు అనుష్క అయితేనే యాప్ట్‌ అని భావించిన యూనిట్‌ అనుష్కను సంప్రదించిందట. అందుకు స్వీటీ కూడా ఓకే చెప్పేయడం జరిగిందని టాక్.  త్వరలో ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ చిత్రంతోనైనా కృష్ణవంశీ తన పూర్వవైభవాన్ని పొందుతాడో..? లేదో? చూద్దాం!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs