హీరో రామ్‌కి తన కెరీర్‌లో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ. తను ఎంత కష్టపడి డాన్స్ చేసినా, ఎంత కష్టపడి ఫైట్స్ చేసినా చివరికి డైరెక్టర్, సబ్జెక్ట్, బ్యాడ్ రిలీజ్, ప్రొడ్యూసర్...ఇలా ఏదో ఒక కారణంతో ఆ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చేస్తుంది. చాలా కాలం తర్వాత పండగ చేస్కో చిత్రం సూపర్‌హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా ఆ నిర్మాతకి ఆశించిన లాభాల్ని అందించలేకపోయిందట. ఆ సినిమా తర్వాత అక్టోబర్ 2న విడుదలైన శివమ్ రామ్ కెరీర్‌లోనే మరో పెద్ద డిజాస్టర్ అయింది. ఎంత డిజాస్టర్ అంటే సినిమా రిలీజ్ అయిన నెల పదిరోజుల్లోనే టి.వి.లో టెలీకాస్ట్ అయింది. సబ్జెక్ట్‌పరంగా, టేకింగ్ పరంగా సినిమా బాగానే వుంది కదా ఎందుకిలా జరిగిందని రామ్ షాక్ అయ్యాడు. ఏవిధంగా చూసినా అతనికి టైటిల్ మీదే పెద్ద డౌట్ వస్తోందట. టైటిల్ వల్లే సినిమా ఫ్లాప్ అయిందా అనే కోణంలో ఆలోచిస్తున్నాడట. అతని నెక్స్‌ట్ సినిమా హరికథ. శివమ్ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్సే ఆ సినిమాకి కూడా పనిచేశారు. వన్ ప్లస్ వన్ ఆఫర్‌లో హరికథ సినిమా కూడా చేశారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందులో ఎంత నిజం వుందో తెలీదుగానీ, హరికథ అనే టైటిల్ వింటే భయపడిపోతున్నాడట రామ్. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ మార్చాల్సిందేనని పట్టుపట్టాడట. దీంతో దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఆ సినిమాకి ఏ టైటిల్ అయితే సరిపోతుందో వెతకడం మొదలు పెట్టారు. ఇప్పటివరకు వారు పరిశీలించిన టైటిల్స్‌లో నేనుశైలజ అనే టైటిల్ ఓకే అయినట్టు తెలుస్తోంది. చివరికి దీన్నే ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ టైటిల్ రామ్‌కి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.