గత కొంత కాలంగా ప్రభాస్ కు పెళ్లి నిశ్చయం అయిందని, భీమవరంకు చెందిన ఓ అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడనున్నాడని వార్తలు వినిపించాయి. ఈ వార్తలు విన్న ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఇలాంటి రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో.. తెలియడం లేదని ఆయన అన్నారు. ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదని ఇలాంటి రూమర్స్ చాలా వినిపిస్తున్నాయని ఆయన కోప్పడ్డారు. ఏదైనా ఉంటే నేరుగా మీడియాకు తెలియజేస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి' పార్ట్ 2 షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.