గత కొద్దిరోజులుగా చీకటి సామ్రాజ్యపు అధినేత చోటారాజన్ మీడియాలో ఉంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో చోటారాజన్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌లో బయోగ్రాఫికల్ ఫిల్మ్స్‌కు మంచి డిమాండ్ ఉండటంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు, బిజినెస్ ఉంటుంది. కాగా ఈ చిత్రంలో చోటారాజన్‌గా అభిషేక్ బచ్చన్ నటించనున్నాడు. ఎస్‌హుస్సేనీ రచించిన 'బైకుల్లా టు బ్యాంకాక్' పుస్తకం ఆధారంగా గ్యాంగ్‌స్టర్స్, అవినీతి రాజకీయ నాయకులు అంశాలపై సంజయ్ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. గతంలో ఒకటిరెండు చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్‌గా నటించిన అభిషేక్‌బచ్చన్ ఈ చిత్రంలో చోటారాజన్‌గా నటించనుండటంతో ఈ చిత్రంపై అంచనాలు బాగా పెరుగుతున్నాయి.