'అఖిల్' అనే టైటిల్‌తో 'ది పవర్ ఆఫ్ జువా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ దీపావళి కానుకగా విడుదలకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. దీపావళి అంటే అమావాస్యరోజు వస్తుంది. అమావాస్య తెలుగు వారికి అరిష్టం. ఇదే పాయింట్ అక్కినేని కుటుంబసభ్యులకు కూడా వచ్చిందట. దాంతో రెండు రోజుల క్రితమే మంచి రోజు చూసుకొని ఈ అమావాస్యగండాన్ని దాటి దాదాపు ఫ్యామిలీ సభ్యులంతా సినిమా చూశారని తెలుస్తోంది. తొలి ట్రైలర్‌ని కొద్దికాలం కిందట విడుదల చేశారు. కానీ ఆ ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. తాజాగా ఓ కొత్త ట్రైలర్‌ను వదిలారు. ఈ ట్రైలర్ చూసిన వారంతా ఇదే మొదట వదిలి ఉంటే క్రేజ్ మరింతగా బాగుండేదని అంటున్నారు. మొత్తానికి 'అఖిల్' సినిమా రిజల్ట్ మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది కాబట్టి అప్పటిదాకా వేచిచూడాల్సిందే అంటున్నారు.