పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'లోఫర్' సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చితాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను చూసిన నిర్మాత కళ్యాణ్, రామ్ గోపాల్ వర్మ టైటిల్ సినిమాకు యాప్ట్ గా లేదని మరో టైటిల్ ను పెట్టమని పూరి కి సజెస్ట్ చేసారు. ఈ విషయాన్ని పూరినే ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. 'లోఫర్' అనే టైటిల్ ను మార్చే అవకాశాలున్నాయని కూడా చెప్పాడు. కాని 'లోఫర్' పేరుతోనే ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ చేసాడు. 'జ్యోతిలక్ష్మి' చిత్రానికి కూడా నిర్మాత సి.కళ్యానే. ఆ సినిమా టైటిల్ కూడా తనకు నచ్చలేదని, మార్చమని చెప్పిన సి.కళ్యాణ్ మాట పూరి అప్పుడు వినలేదు. తాజాగా 'లోఫర్' విషయంలో కూడా అదే జరిగింది. దీనిని బట్టి డైరెక్టర్ ను నమ్మి డబ్బు పెట్టి సినిమాలు తీసే నిర్మాతకు కొంచెం గౌరవం కూడా దక్కట్లేదని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా.. పూరి.. నిర్మాతల మాటలను కాస్త లెక్కలోకి తీసుకుంటే బావుంటుంది..!