ప్రస్తుతం అల్లుఅర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' అనే చిత్రం చేస్తున్నాడు. కాగా 'మనం' సినిమాతో అందరినీ అబ్బురపరిచిన డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ తాజాగా బన్నీకి ఓ స్టోరీ చెప్పాడట. ఈ స్టోరీ బన్నీకి విపరీతంగా నచ్చడంతో 'సరైనోడు' తర్వాత విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నటించడానికి బన్నీ రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విక్రమ్‌కుమార్ తమిళంలో సూర్య హీరోగా '24' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంపై కోలీవుడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం ఫలితాన్ని బట్టి విక్రమ్‌తో ఎప్పుడు చేయాలా? అనే విషయంపై బన్నీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇది కాక, బన్నీ.. చందుమొండేటి చెప్పిన స్టోరీలైన్‌ను కూడా ఓకే చేశాడని సమాచారం. విక్రమ్‌కుమార్ చిత్రం తర్వాత చందు మొండేటి చిత్రం చేసే అవకాశం ఉంది. ఆల్‌రెడీ హరీష్‌శంకర్ కూడా ఓ స్టోరీని బన్నీకి వినిపించి ఆమోద ముద్ర వేయించుకున్నాడు. సో.. సినిమా సినిమాకి గ్యాప్ రాకుండా బన్నీ సరైన ప్లానింగ్‌తో ముందుకు దూసుకుపోతున్నాడని చెప్పవచ్చు.