ఇటీవల 'సైజ్‌జీరో' ఆడియో వేడుకలో హీరోయిన్ అనుష్క తొడలపై కామెంట్లు చేసిన అలీ వివాదానికి కేంద్రబిందువుగా మారాడు. సినిమా వేడుకల్లో అలీ హీరోయిన్ల గురించి వల్గర్‌గా కామెంట్లు చేస్తున్నాడంటూ విమర్శలు వచ్చాయి. గతంలో సమంత నడుమును కూడా బెంజిసర్కిల్‌తో పోల్చిన అలీ చాలాసార్లు ఇలానే కామెంట్లు చేసి పలువురి ఆగ్రహానికి గురయ్యాడు. తన కామెంట్స్‌కి వచ్చిన విమర్శలపై అలీ తనదైన రీతిలో స్పందిస్తున్నట్లు సమాచారం. మహేష్‌బాబు కూడా 'ఖలేజా' సినిమాలో అనుష్క తొడలపై కామెంట్ చేశాడు. అప్పుడు ఎవ్వరూ ఆ విషయాన్ని తప్పుబట్టలేదు. పాపులర్ యాక్టర్ కామెంట్ చేస్తే ఎవరికీ వివాదం అనిపించదు. నేను అంటే మాత్రం వివాదం అవుతోంది.. అని తన సన్నిహితులతో అలీ అన్నాడని తెలుస్తోంది.