నిన్నటితరం అతిలోకసుందరి శ్రీదేవి మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె దాదాపు 25ఏళ్ల తర్వాత తమిళంలో ఇటీవల విజయ్ హీరోగా నటించిన 'పులి' చిత్రంలో రాణిగా కీలకపాత్ర పోషించింది. కానీ ఈ చిత్రం విజయం సాధించలేదు. మరోసారి ఈ చిత్రంతోనే శ్రీదేవి వార్తల్లోకి ఎక్కింది. 'పులి' చిత్ర నిర్మాతలు తన రెమ్యూనరేషన్‌లో బాకీ పడిన 50లక్షలను ఇప్పటికీ ఇవ్వడం లేదని, అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె వాదిస్తోంది. ఈచిత్రం విడుదలై నెలలు కావస్తున్నా పెండింగ్‌లో ఉన్న తన 50లక్షల రెమ్యూనరేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదని ఆమె నిర్మాతల మండలిలో ఈ విషయమై ఫిర్యాదు చేసిందట. కానీ ఈ చిత్ర నిర్మాతలు మాత్రం తాము ఆమెకు ఏమీ ఇవ్వనవసరం లేదని వాదిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాల్సివుంది...!