ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ నటించిన చిత్రాలు హిట్టయితే ఈజీగా 500 ల కోట్లను దాటేస్తున్నాయి. కానీ ఒకే సినిమాతో 1000 కోట్లు సాదించడం మాత్రం ఇప్పట్లో జరిగేపని కాదు. కాగా ఒకే ఏడాదిలో తాను నటించిన చిత్రాలతో 1000కోట్లు సాధించడం మాత్రం సల్మాన్‌ఖాన్ వంటి స్టార్‌కు సాధ్యమే అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'భజరంగీ భాయిజాన్' చిత్రంతో దాదాపు 600కోట్లను వసూలు చేసిన సల్మాన్.. ఇదే ఏడాది తాను చేస్తున్న 'ప్రేమ్‌రతన్ పాయో' చిత్రంతో మరో 400కోట్లు సాధిస్తే ఒకే ఏడాది 1000కోట్లు వసూలు చేసిన హీరోగా రికార్డు సృష్టిస్తాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకానుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో ఒకేసారి 'ప్రేమలీల'గా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్ పాత్రకు రామ్‌చరణ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. మొత్తానికి ఎలాగైనా మరో 500 కోట్లపై సల్మాన్‌ఖాన్ కన్నేశాడు. మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సివుంది. సినిమా హిట్ టాక్ వస్తే.. సల్మాన్ కి ఇదో పెద్ద విషయమే కాదు.