ఘనంగా ముగిసిన 'ముంబాయి ఫిలిం ఫెస్టివల్' (మామి)
ఈ మధ్య మనం మామి (MAMI) ట్రైలర్స్ అన్ని మల్టీపెక్స్ లో చాలా సార్లు చూసి ఉన్నాం. అదే 17వ ముంబాయి ఫిలిం ఫెస్టివల్. మామి అని ఎందుకంటారంటే దీని ఆర్గనైజర్స్ ముంబాయి అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్ కాబట్టి. 1997లో హృషికేష్ ముఖర్జి చేతులు మీదుగా స్థాపించబడినా, ఈమధ్యే బాగా ప్రాచుర్యంలోకి రావడానికి కారణం యంగ్ ఫిల్మేకర్ల వల్లే.. ప్రస్థుత చైర్మన్ కిరణ్ రావ్. అక్టోబర్ 29 నుండి నవంబర్ 5 వరకు దాదాపు 59 దేశాల నుండి 200 ఫిలిమ్స్ 16 స్రీన్స్ లో ఎనిమిది రోజుల పాటు ప్రదర్శించి సినీ ప్రియులను, విమర్షకులనేకాక ఈసారి చాలా మంది సీనీ దిగ్గజాలను కూడా ఆకట్టుకొంది.
చివరి రోజున సల్మాన్ ఖాన్, జాకీషరాఫ్, విధ్యాబాలన్, సిధ్దార్థ రాయ్ కపూర్, సైఫ్ అలీఖాన్, నందితాదాస్, విధువినోద్ చోప్రా, రితేష్ దేశ్ ముఖ్, కల్కీ కొచ్చిన్.. అంతకు మునుపు ప్రారంభ వేడుకలకు రాజ్ కుమార్ హిరాణీ, కంగన, అభిషేక్ భచ్చన్, ఏ.ఆర్.రెహమాన్, నీతా అంబానీ, జావెద్ అక్తర్, షబానా ఆజ్మి మరియు చాలా విదేశీ ప్రముఖులు వచ్చారు.
కేవలం చిత్రాల ప్రదర్శనే కాక మూవీ మేల అంటూ క్లాసిక్ ఫిల్మ్ గా నిలిచిన మిస్టర్ ఇండియ నటుల రియూనియన్, డైరెక్టర్స్ స్టుడియో, బాలివుడ్ మాస్టర్ క్లాసెస్ లాంటివే కాక మరెన్నో వర్క్ షాప్స్, ప్రముఖులతో మాటామంతి అంటూ ఇంటర్వూలు కూడా ఏర్పాటు చేయడం మరింత వన్నె తెచ్చింది. పాన్ నలిన్ (సంసార ఫేం డైరెక్టర్) ఏంగ్రి ఇండియన్ గాడెసెస్ లాంటి కొన్ని ఇండియన్ ఫిలిమ్స్ మాత్రం విమర్షకుల ప్రశంసలు అందుకొన్నాయి..
ప్రముఖ అవార్డు పొందిన చిత్రాలు, వ్యక్తులు
Audience Choice Awards - Taxi by Jafar Panahi
Best Yong Critic Awards – Wayne D’ Mello
Children’s feature Awards (Golden Gatway ) – Jairaj for Ottaal
International Competition Winners – Volcano by Jayro Bustamante
India Gold Competition Winners - Chauthi Koot by Gurvinder Singh
Click Here to see the Jio Mami 17th Mumbai Film Festival Closing Ceremony Photos