అల్లరినరేష్‌తో విజయాలు దోబూచులాడుతున్నాయి. ఆయన మినిమం గ్యారంటీ హీరో అనే ముద్ర నుండి బయట పడి ఒకే ఒక్క హిట్ వస్తే చాలు అనే ఆతృతలో ఉన్నాడు. అందుకే తాను నటించబోయే 50వ చిత్రం విషయంలో మామ మంచు మోహన్‌బాబు సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో అల్లరినరేష్‌కు జోడీగా పూర్ణ నటిస్తోంది. అయితే మోహన్‌బాబుకు సరసన ఆయనకు అచ్చివచ్చిన రమ్యకృష్ణ, మీనాలు నటిస్తున్నారు. వీరు నటించిన 'అల్లరి మొగుడు' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే హిట్ సెంటిమెంట్ తనకు కూడా కలిసి వస్తుందనే ఆశతో అల్లరినరేష్ ఉన్నాడు. కాగా 'బొమ్మన బ్రదర్స్..చందన సిస్టర్స్' ఫేమ్ శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈచిత్రంలో వంద శాతం వినోదం గ్యారంటీ అంటున్నారు. మరి తన 50వ చిత్రానైనా మోహన్‌బాబు సహకారంతో హిట్ కొట్టాలని నరేష్ ఎంతో నమ్మకంతో ఉన్నాడు. కాగా ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్దమవుతోంది.