పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఓ స్టార్ హీరో మీద తెలుగు ప్రజలు పెంచుకునే అభిమానం ఎన్ని హద్దులు దాటుతుందో ఎన్టీయార్, చిరంజీవిల తరువాత మళ్ళీ పవన్ అభిమానులు పలుమార్లు ప్రూవ్ చేసి చూపారు. ఇందుకు పవన్ సినిమాలే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా బాగా దోహదపడింది. ప్రస్తుతానికి పవన్ నుండి రావాల్సిన సర్దార్ గబ్బర్ సింగ్ కాస్తంత ఆలస్యం అయిన మాట వాస్తవమే అయినా ఇటువంటివి ఏవీ పవన్ అభిమానులని కట్టడి చేయలేవు. శరత్ మరార్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ స్పాటులో పవన్ ఎంత సరదాగా ఉన్నాడో తెలిసేలా నిర్మాతగారు రెండు ఫోటోలు తీసి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టడంతో పవర్ స్టార్ అభిమానులు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసారు. పవన్ కళ్యాణ్ పక్కనే అలీ, బ్రహ్మాజీ, నర్రా, శరత్ మరార్ ఉన్నప్పటికీ, సర్దార్ గబ్బర్ సింగ్ మాయ నెటిజెన్ల మీద తీవ్రంగా కమ్మేసింది. ఇది సినిమా పోస్టర్ కాకపోయినా, అంతకన్నా ఎక్కువ లైక్స్, షేర్స్ పడ్డాయి. అందుకే హరీష్ శంకర్ అప్పుడే రాశాడేమో, కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు... కాదు కంటెంట్ ఉన్నోడికి ఫోటో ఒక్కటి చాలు. దటీజ్ సర్దార్ గబ్బర్ సింగ్ పవర్.