ఎన్నో ఒడిదొడుకులు తట్టుకుని, అన్ని అవాంతరాలను దాటుకుంటూ అక్కినేని అఖిల్ తన మొదటి చిత్రం అఖిల్ రిలీజుకు సిద్ధంగా ఉన్నాడు. తండ్రిగా నాగార్జున ప్రతి అడుగులో ముందుండి కొడుకుని పరిచయం చేయబోతున్న ఈ సినిమా పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజమైన దీపావళి ఈ సినిమా రిలీజేనంటూ అభిమానులు అప్పుడే సంబరాల్లో ఓలలాడుతున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో, సరికొత్త సోషియో ఫ్యాంటసీ కథతో ముందుకు రాబోతున్న ఈ మూవీ యొక్క బాక్సాఫీస్ భవిష్యత్తు అందరి కన్నా ముందు నాగార్జునే అంచనా వేసారట.
వెలిగొండ శ్రీనివాస్ అందించిన కథను మొదటిసారి విన్నప్పుడే నాగార్జున తప్పకుండా ఇది కమర్షియల్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాడట. ఎప్పుడైతే వినాయక్, నితిన్ లాంటి ప్యాషనేట్ దర్శక నిర్మాతలు కుదిరారో, ఇక అఖిల్ తెరంగేట్రంపై వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని నాగ గట్టిగా నమ్మాడు. అందుకే కాబోలు ఖర్చుకు వెనకాడకుండా నితిన్ కూడా ఓ మొదటి సినిమా హీరో మీద నలభై కోట్ల పై చీలుకు బడ్జెట్ వెచ్చించాడంటే అది నాగార్జున మీద ఉన్న గౌరవం, అఖిల్ మీదున్న నమ్మకంతోనే అని చెప్పొచ్చు. మరి నాగార్జున ఊహించినట్టుగానే అఖిల్ అన్ని రికార్డులు బద్దలుకొట్టి గతంలో ఎన్నడు చూడని, భవిష్యత్తులో ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం.