ఒకప్పుడు విజయశాంతి, ఇప్పుడు అనుష్క. తెలుగు సినిమా చరిత్రలో హీరోయిన్ సెంటరుడు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నటీమణులుగా వీరిద్దరే చిరకాలం గుర్తుండిపోతారు. అరుంధతి నుండి అప్రతిహతంగా ప్రయాణం సాగిస్తున్న అనుష్కకు ఇప్పట్లో చెక్ పెట్టె మరే పోటీదారు కనిపించడంలేదు. బాహుబలి 2 కోసం సర్వం ఒడ్డి రాజమౌళితో కష్టపడుతున్న అనుష్కకు ఇది పూర్తవగానే మరో రెండు లేడీ ఓరిఎంటేడ్ కథలు సిద్ధమయ్యాయి. అంటే మరో రెండు మూడేళ్ళ వరకు స్వీటీని పక్కా గ్లామ-రసం కురిపించే రసగుల్లాలాంటి పాత్రల్లో చూడడం వీలవదు.
అశోక్ దర్శకత్వంలో భాగమతి వచ్చే ఏడాది ఆఖరుకి లైన్లో ఉంటె బడా నిర్మాత దిల్ రాజు సైతం అనుష్క కోసమే ఓ స్పెషల్ పవర్ ఫుల్ స్టోరీలైన్ ప్రిపేర్ చేయించాడని తెలుస్తోంది. అంతటి నిర్మాత తలుచుకుంటే అనుష్క రాకుండా ఉంటుందా. బహుశా బాహుబలి 2, భాగమతిల తరువాత ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ మొదలవచ్చు. బాహుబలి, రుద్రమదేవి లాంటి కళాఖండాలకు లభిస్తున్న ఆదరణతోనే దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకోనుంటాడని ఓ వార్త. ఏదైతే ఏందీ, అందరికీ అనుష్కే కావాలంటే మరి మిగతా హీరోయిన్లు ఇటువంటి కథల వైపు కూడా చూడకుండా ఉండాలేమో.