అందరూ అనుకున్నట్టుగానే బాహుబలి మొదటి భాగంతో నిరుత్సాహపడ్డ ఆ కొద్ది మంది ప్రేక్షకులను కూడా సంతృప్తి పరచడానికి రాజమౌళి అన్ని రకాల కసరత్తులు మొదలెట్టాడు. ప్రస్తుతం బాహుబలి 2 కోసం విపరీతమైన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ నెలాఖరుకి గానీ కొత్త ఏడాది జనవరికి గానీ షూటింగ్ మొదలవని బాహుబలి 2 కథలో మనం ఊహించని కొత్త పాత్రలు, కొంగ్రొత్త మలుపులు ఉండబోతున్నాయని టాక్. ప్రభాస్, రానా, అనుష్కలు సెంట్రల్ పాత్రలుగానే కొనసాగినా సపోర్టింగ్ క్యాస్ట్ విషయంలో సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్లకు తోడుగా ఇప్పుడు లావణ్య త్రిపాటి రాబోతుందని ఓ వార్త. భల్లాల దేవ రానా సరసన నటించే భార్య పాత్ర కోసం లావణ్యను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రానా కొడుకుగా మొదటి భాగంతోనే మరణం చెందిన అడవి శేష్ తల్లి పాత్రే ఇది. భల్లాల దేవకు వివాహం జరగడం ఓ పక్కన, బాహుబలి అండ్ దేవసేనల ప్రేమ వ్యవహారం మరో పక్కన ముఖ్యఘట్టాలుగా బాహుబలి 2 ఫస్టాఫ్ ఉండబోతుందని తెలుస్తోంది. బాహుబలిని కట్టప్ప సంహరించడంతో కథ ప్రీ క్లైమాక్స్ చేరుకొని తండ్రి వదిలిన శత్రుశేషాన్ని కొడుకు శివుడు పూర్తి చేయడం తదుపరి సెకండాఫ్ చివరి ఘట్టాలుగా ఉండబోతున్నాయట. ఇలాంటి సినిమాలో అవకాశం దొరికితే జన్మకు సార్థకత లభిస్తుందని ప్రతి ఆర్టిస్టు ఆశ పడుతున్న వేళ లావణ్య త్రిపాఠికి రాజమౌళి పిలిచి మరి చాన్స్ ఇస్తుంటే అమ్మడు కాదని అనగలదా?