'ఐ' చిత్రంతో దర్శకుడు శంకర్, 'కొచ్చాడయాన్, లింగా' చిత్రాలతో రజనీకాంత్‌లు ఫ్లాప్‌లు మూటగట్టుకున్నారు. కాగా ప్రస్తుతం రజనీ రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ కల్లా పూర్తి కావాల్సివుంది. ఆ తర్వాత ఆయన శంకర్ దర్శకత్వంలో రూపొందే 'రోబో2'కు సిద్దం అవుతాడు. అయితే రజనీ లేకపోయినా శంకర్ మాత్రం 'రోబో2' పనులను ప్రారంభించాడు. ఆయన ప్రస్తుతం ప్రీపొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 30 నుండి ఆయన ఈ చిత్రం ప్రీపోడక్షన్ పనులు ప్రారంభించాడు. 8నెలల గ్యాప్ తర్వాత ఆయన మరలా బిజీ అయ్యాడు. ముంబై వెళ్లి సినిమాటోగ్రాఫర్ నీరవ్‌షాతో శంకర్ 3డి వర్క్‌పై చర్చించి వచ్చాడు. ఈ చిత్రాన్ని జనవరి నుండి సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి శంకర్ రెడీ అవుతున్నాడు. ఎప్పటిలా కాకుండా 'రోబో2'ను ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించాడు. కాగా ఈచిత్రం బడ్జెట్ నాలుగు వందల కోట్లని అంటున్నారు. ఈచిత్రాన్ని ఎలాగైనా 2016లోనే విడుదల చేయాలని శంకర్ ప్రతినబూనాడు. మరి ఈ చిత్రమైనా శంకర్‌కు మళ్లీ పెద్ద హిట్ రూపంలో కలిసి వస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!