బ్రూస్ లీ పతనానికి కోన వెంకట్ కారణం ఎన్నిపాళ్లో తెలియదు గానీ ఇప్పుడైతే అక్కినేని అభిమానుల ఆగ్రహానికి కోనగారు మొదటి రీజన్ అవుతున్నారు. కోన సార్ కథనం, మాటలు అలాగే నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకున్న శంకరాభరణం చిత్రాన్ని అఖిల్ నాన్ స్టాప్ రన్ కోసం డిసెంబర్ నాలుగుకి తరలించామని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే అఖిల్ సినిమాకు శంకరాభరణం ఏ విధంగా పోటీ అని ఇతగాడు ఫీలయ్యాడబ్బా అన్నదే అక్కినేని ఫ్యాన్స్ అనుమానం.
హీరోల పరంగా, బడ్జెట్ పరంగా, హైప్ పరంగా... ఎలా పోల్చుకున్నా అఖిల్ ముందు శంకరాభరణం జూజూబీ. కేవలం థియేటర్ల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఏకైన రీజన్ చేత విడుదలను వాయిదా వేసుకున్న కోన వెంకట్, దానికి కొంత కలరింగ్ ఇచ్చి అఖిల్ చిత్రాన్ని ఆదుకోవడానికి అన్నట్లుగా బిల్డప్పు ఇవ్వడం ఎవరికీ సుతారం నచ్చలేదు. చూడబోతే రేపు అఖిల్ కలెక్షన్ల రేంజు ఏమైనా తగ్గితే శంకరాభరణం వల్లే అని చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. చిన్ని సినిమాలకు పెద్ద దిక్కుగా మారిన కోన వెంకట్ ఇలా మాట్లాడడం వింతగానే ఉన్నా రెండు సినిమాలు విడుదలయ్యాక గానీ అయ్యగారు చేసిన నిర్వాకం బయటపడదని మెగా అభిమానులు అప్పుడే తమ అస్త్రాలు ఎక్కుపెట్టి సంసిద్దంగా ఉన్నారు.